కూతురుతో పాటు నేనూ చనిపోయా!: విజయ్ ఆంటోని ఎమోషనల్
- కూతురు మృతి తర్వాత మొదటిసారి భావోద్వేగంతో పోస్ట్ చేసిన విజయ్ ఆంటోనీ
- ఇక నుంచి చేయబోయే ప్రతి మంచి పనిని ఆమె పేరునే చేస్తానని స్పష్టీకరణ
- కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం, శత్రుత్వం లేని ప్రదేశానికి వెళ్లిందన్న విజయ్
తన కూతురు ప్రేమగల, ఎంతో ధైర్యవంతురాలైన అమ్మాయి అని పేర్కొన్నారు. ఇప్పుడు ఆమె ఏ కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం, శత్రుత్వం లేని ఓ మంచి, నిశ్శబ్ద ప్రదేశానికి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. తన కూతురు ఇప్పటికీ తనతోనే ఉన్నట్లుగా ఉందని, తాను కూడా కూతురుతో పాటు మరణించానని ఎమోషనల్ అయ్యారు. ఇక నుంచి తాను ఏం చేసినా ఆమె కోసమే చేస్తానన్నారు. చెన్నైలోని ఓ ప్రయివేటు పాఠశాలలో మీరా పన్నెండో తరగతి చదువుతోంది.