ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 28న 'చంద్రముఖి 2' గ్రాండ్ రిలీజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 28న 'చంద్రముఖి 2' గ్రాండ్ రిలీజ్

Chandramukhi 2 Movie Update
  • కంగనా ప్రధాన పాత్రధారిగా రూపొందిన 'చంద్రముఖి 2'
  • కీలకమైన పాత్రను పోషించిన లారెన్స్ 
  • ఈ నెల 24వ తేదీన జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • 28వ తేదీన సినిమా విడుదల
స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు రూపొందించారు. తెలుగు, త‌మిళ, హిందీ, కన్నడ, మలయాళ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబ‌ర్ 28న ఈ సినిమా విడుద‌ల‌వుతోంది. 
 
తెలుగు రాష్ట్రాల్లో ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యాన‌ర్‌పై తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్‌గా రిలీజైన ‘చంద్రముఖి 2’ ట్రైలర్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను నెక్ట్స్ రేంజ్‌కి తీసుకెళ్లింది. 17 సంవత్స‌రాల క్రితం 'చంద్ర‌ముఖి' తన బందీగా ఉంటున్న గ‌ది త‌లుపులు తెరుచుకుని వేట్ట‌య రాజాపై ప‌గ తీర్చుకోవ‌టానికి ప్రయ‌త్నించి విఫ‌ల‌మైంది. ఇన్నేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు త‌న ప‌గ తీర్చుకోవ‌టానికి 'చంద్రముఖి' మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

 ఓ వైపు హారర్, మరో వైపు కామెడీ ఎలిమెంట్స్‌తో చంద్రముఖి 2 అలరించనుందని ట్రైలర్‌లో స్పష్టమైంది. 'చంద్రముఖి'గా కంగనా రనౌత్ మెప్పించనుండగా.. ఓ వైపు స్టైలిష్ లుక్, మరోవైపు వేట్టయ రాజాగా రాఘవ లారెన్స్ అలరించబోతున్నారు. సెప్టెంబర్ 24న ‘చంద్రముఖి 2’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌ జె.ఆర్.సి.కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. 
Advertisement
Kangana Ranaut
Lawrence
Keeravani
Chandramukhi 2

More Telugu News