Advertisement

నారా బ్రాహ్మణి నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి: పోసాని

Posani questions Nara Brahmani
  • చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో నారా బ్రాహ్మణి వ్యాఖ్యలు
  • బ్రాహ్మణి వ్యాఖ్యలు నవ్వుకునేలా ఉన్నాయన్న పోసాని
  • మీ తాతయ్యను వెన్నుపోటు పొడిచింది ఎవరంటూ ప్రశ్న
  • అవినీతికి పాల్పడిన వాళ్లనే జైలుకు పంపుతారని వెల్లడి
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై నారా బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్, సినీ ప్రముఖుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. నారా బ్రాహ్మణి మాటలు నవ్వుకునేలా ఉన్నాయని కొట్టిపారేశారు. బ్రాహ్మణి మాటలు వింటుంటే న్యాయమూర్తి మీద కూడా కేసు పెట్టాలేమో అని వ్యాఖ్యానించారు. 

నారా బ్రాహ్మణి తాను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని పోసాని స్పష్టం చేశారు. మీ తాతయ్యను ఎవరు వెన్నుపోటు పొడిచారు? మీ తాతయ్యను చెప్పుతో కొట్టింది ఎవరు? మీ తాతయ్యను చంపంది ఎవరు? అంటూ ప్రశ్నించారు. 

ఈ సందర్భంగా పోసాని... చంద్రబాబుపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజల కోసమే జైలుకు వెళ్లానని చెబుతున్న చంద్రబాబు... ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిందీ, 23 మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నది కూడా ప్రజల కోసమేనా? అని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడినవాళ్లనే జైలుకు పంపుతారని పోసాని వ్యాఖ్యానించారు.
Advertisement
Posani Krishna Murali
Nara Brahmani
Chandrababu
Arrest
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News