వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై ఎస్సీ ఎస్టీ కేసు

Jakkampudi Raja SC ST Atrocity case filed against former YSRCP MLA
  • గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజుపై తీవ్ర వ్యాఖ్యలు
  • వైఎస్సార్ వర్ధంతి సభలో ఘటన
  • టీడీపీ నేత ఫిర్యాదుతో కేసు నమోదు
వైసీపీ నేత, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజును కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ నెల 2వ తేదీన దూబచర్లలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సభలో పాల్గొన్న జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ వ్యాఖ్యలపై దూబచర్ల తెలుగుదేశం పార్టీ నాయకుడు బోడిగడ్ల నాగరఘు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు జక్కంపూడి రాజాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయబాబు ధ్రువీకరించారు.  
Advertisement
Jakkampudi Raja
Maddipati Venkataraju
SC ST Atrocity Case
East Godavari Police
Andhra Pradesh Politics
YSRCP Leader Case

More Telugu News