నగ్న పూజల పేరుతో మోసం.. విదేశీ మహిళను బ్లాక్‌మెయిల్ చేసిన జ్యోతిష్కుడు అరెస్ట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నగ్న పూజల పేరుతో మోసం.. విదేశీ మహిళను బ్లాక్‌మెయిల్ చేసిన జ్యోతిష్కుడు అరెస్ట్

Isakkimuthu arrested for blackmailing foreign woman in the name of nude rituals
  • నగ్న పూజల పేరుతో విదేశీ మహిళకు వేధింపులు
  • చిలుక జోస్యం చెప్పి నమ్మించిన ఇసక్కిముత్తు
  • వీడియో కాల్ రికార్డు చేసి డబ్బు కోసం బ్లాక్‌మెయిల్
  • బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్
వీడియో కాల్‌లో ఓ విదేశీ మహిళతో నగ్నంగా పూజలు చేయించి, ఆ దృశ్యాలను రికార్డు చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన ఓ జ్యోతిష్కుడిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల వివరాల ప్రకారం, కెనడాకు చెందిన 37 ఏళ్ల మహిళ ఇటీవల తమిళనాడు పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలో చెన్నైలోని బెసెంట్ నగర్ బీచ్‌లో ఆమెకు చిలుక జోస్యం చెప్పే ఇసక్కిముత్తు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆమె జాతకం చూస్తున్నట్లు నటించిన నిందితుడు, "మిమ్మల్ని గతంలో టీవీలో చూశాను, నేను చెప్పినట్లు చేస్తే మీరు జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతారు" అని ఆమెను నమ్మబలికాడు.

అనుకున్నది సాధించాలంటే నగ్నంగా ఒక ప్రత్యేక పూజ నిర్వహించాలని, వీడియో కాల్ ద్వారా కూడా దీనిని చేయవచ్చని ఆమెకు సూచించాడు. అతని మాటలను నమ్మిన బాధితురాలు వీడియో కాల్‌లో నగ్నంగా పూజలో పాల్గొన్నారు. ఇందుకు గాను ఆమె నుంచి రూ. 20,000 వసూలు చేశాడు. కొద్ది రోజుల తర్వాత ఆమెకు ఫోన్ చేసిన నిందితుడు, తన వద్ద ఉన్న నగ్న వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేస్తానని, అలా చేయకూడదంటే డబ్బు ఇవ్వాలని బెదిరించడం ప్రారంభించాడు.

తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు బుధవారం మాంబలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుడు ఇసక్కిముత్తును అరెస్ట్ చేశారు.
Advertisement
Isakkimuthu
Chennai Police
Astrologer Fraud
Canadian Woman Blackmail
Parrot Astrology Scam

More Telugu News