ఓ దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో విశాల్
- గతంలో మిస్కిన్ దర్శకత్వంలో తుప్పరివాలన్ చిత్రంలో నటించిన విశాల్
- తెలుగులో డిటెక్టివ్ పేరుతో విడుదలైన చిత్రం
- ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన విశాల్
- తుప్పరివాలన్ సీక్వెల్ తీద్దామనుకున్నాక మిస్కిన్ ఇబ్బందిపెట్టాడన్న విశాల్
మిస్కిన్ తనను తీవ్ర వేదనకు గురిచేశాడని, అతడు పెట్టిన బాధలకు ఇంకొకరైతే చనిపోయేవారని వెల్లడించారు. తుప్పరివాలన్ (తెలుగులో డిటెక్టివ్) చిత్రానికి తానే నిర్మాతగా వ్యవహరించానని, కానీ తుప్పరివాలన్-2 తెరకెక్కించాలని భావించిన తర్వాత మిస్కిన్ తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడని విశాల్ వాపోయారు.
తన స్థానంలో ఎవరైనా పెద్ద వయసున్న నిర్మాత ఉండుంటే హార్ట్ అటాక్ తో చచ్చిపోయేవారని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో లండన్ లో ప్లాట్ ఫారంపై కూర్చుని ఒంటరిగా ఎంతో బాధపడ్డానని విశాల్ గుర్తు చేసుకున్నారు.
మరోసారి మిస్కిన్ తో కలిసి పనిచేయబోనని స్పష్టం చేశారు. మిస్కిన్ తో కలిసి తుప్పరివాలన్-2 తెరకెక్కించే ప్రయత్నం చేసినా అది పూర్తికాదని అన్నారు. 2024లో తానే సొంతంగా స్క్రీన్ ప్లే సమకూర్చుకుని తుప్పరివాలన్-2 తెరకెక్కిస్తానని విశాల్ తెలిపారు.