వాళ్లకు పుట్టగతులు ఉండవు.. చంద్రబాబుకు 160 సీట్లు వస్తాయి: అశ్వనీదత్

Chandrababu will win 160 seats in next elections says Ashwini Dutt
  • చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారన్న అశ్వనీ దత్ 
  • దుర్మార్గంగా అరెస్ట్ చేసి, బీభత్సం చేశారని ఆగ్రహం
  • ఎన్నికల్లో శిక్షను అనుభవిస్తారని వ్యాఖ్య
టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని సినీ నిర్మాత అశ్వనీ దత్ మండిపడ్డారు. అదొక దురదృష్టకరమైన రోజని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశానికి ఒక గొప్ప ప్రైమ్ మినిస్టర్ ను, ఒక గొప్ప లోక్ సభ స్పీకర్ ను, ఒక గొప్ప రాష్ట్రపతిని ఇచ్చిన ది గ్రేట్ లెజెండరీ చంద్రబాబును ఇంత దుర్మార్గంగా అరెస్ట్ చేసి, లేనిపోని బీభత్సం చేసిన వారికి కచ్చితంగా పుట్టగతులు ఉండవని అన్నారు. దీనికి పరిష్కారం ఎన్నో రోజుల్లో లేదని... మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు రాగానే వాళ్లు శిక్షను అనుభవిస్తారని చెప్పారు. 175 సీట్లకు కచ్చితంగా 160 సీట్లను చంద్రబాబు గెలిచి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. 

మరోవైపు మరో సినీ నిర్మాత నట్టి కుమార్ కూడా నిన్న చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడిన సంగతి తెలిసిందే. చంద్రబాబు చిత్రపరిశ్రమకు శ్రేయోభిలాషి వంటి వ్యక్తి అని, అలాంటి వ్యక్తి అరెస్ట్ అయితే చిత్ర పరిశ్రమ పెద్దలు ఎవరూ స్పందించకపోవడం దారుణమని నట్టి కుమార్ వ్యాఖ్యానించారు. 
Go Back to Shorts
Ashwini Dutt
Tollywood
Chandrababu
Telugudesam

More Telugu News