నేను ఏ తప్పూ చేయలేదు.. చంద్రబాబు
- స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్
- సీఐడీ కార్యాలయానికి రోడ్డు మార్గంలో తరలింపు!
- అర్ధరాత్రి వచ్చి పోలీసులు భయభ్రాంతులకు గురిచేశారన్న టీడీపీ అధినేత
కాగా, నంద్యాలలో ఈ ఉదయం చంద్రబాబును అరెస్ట్ చేసిన పోలీసులు రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. ఆయనను సీఐడీ కార్యాలయానికి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. అంతకుముందు ఆయన బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న పోలీసులు పలువురు టీడీపీ నేతలను కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుత నంద్యాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ కార్యకర్తలు, నేతలు ఆందోళనకు దిగారు.