Advertisement

ఇవాళో, రేపో నన్ను చంపేస్తారేమో!: పోసాని సంచలన వ్యాఖ్యలు

Posani sensational comments
  • టీవీ5 యాజమాన్యంపైనా పోసాని తీవ్ర ఆరోపణలు
  • చంపించడం బీఆర్ నాయుడికి చాలా చిన్న పని అని వెల్లడి
  • ఓ వ్యక్తి వద్ద రూ.30 కోట్లు ఎగ్గొట్టాడని ఆరోపణ
  • టీవీ5 సాంబశివరావు భాష నీచాతినీచం అని విమర్శలు
ప్రముఖ నటుడు, రచయిత, ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి టీవీ5 చానల్ అధినేత బీఆర్ నాయుడు, ఆ చానల్ ఎడిటర్ సాంబశివరావుపై సంచలన ఆరోపణలు చేశారు. 

బీఆర్ నాయుడికి చంపించడం అనేది ఏమంత పెద్ద పని కాదని అన్నారు. బీఆర్ నాయుడు టీవీ5 చానల్ పెట్టినప్పుడు ఓ వ్యక్తి దగ్గర తీసుకున్న రూ.30 కోట్లు ఇప్పటికీ తిరిగివ్వలేదని పోసాని వెల్లడించారు. డబ్బు తీసుకున్నదే కాక బెదిరింపులకు దిగారని వివరించారు. టీవీ5 సాంబశివరావు తీరు చూస్తుంటే సినీ ఇండస్ట్రీలో ఎవరినో టార్గెట్ చేసినట్టుందని అన్నారు. 

"నేను ప్రశ్నిస్తుంటే నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. ఇవాళో, రేపో నన్ను చంపేస్తారేమో! మీడియాను ఉద్దేశించి మాట్లాడాలంటేనే భయంగా ఉంది. నాడు బీఆర్ నాయుడికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భిక్ష పెట్టారు. టీవీ5 చానల్లో ఆడవాళ్లపై జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ మహిళలను తిట్టేందుకు సాంబశివరావును బీఆర్ నాయుడు టీవీ5 చానల్లో పెట్టుకున్నట్టుంది. 

సాంబశివరావు మాట్లాడే భాష నీచాతినీచం. సాంబశివరావు తన ఇంట్లోని ఆడవాళ్లతో కూడా ఇలాగే మాట్లాడతారా? సాంబశివరావు వెనుక చంద్రబాబు, లోకేశ్ ఉన్నారని నాకు తెలుసు. మీడియా ముసుగులో బీఆర్ నాయుడు బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఎవరెంత బెదిరించినా నేను ప్రశ్నిస్తూనే ఉంటా" అని పోసాని స్పష్టం చేశారు.
Advertisement
Posani Krishna Murali
TV5
BR Naidu
Sambasivarao
YSRCP

More Telugu News