'స్కంద' కోసం వస్తున్న 'అఖండ'!
- రేపు శిల్పకళా వేదికలో ఆడియో, ప్రీ రిలీజ్ పంక్షన్
- ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ
- సెప్టెంబర్ 15న విడుదల కానున్న చిత్రం
ఈ క్రమంలో రేపు (శనివారం) ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ శిల్పకళా వేదికలో భారీ ఎత్తున నిర్వహించనుంది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ రాబోతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ చిత్రం భారీ విజయం సాధించిన తెలిసిందే. ఈ నేపథ్యంలో స్కంద కోసం అఖండ వస్తున్నాడంటూ ఇరువురు హీరోల ఫ్యాన్స్ జోష్ లో ఉన్నారు.