తాగిన మైకంలో ఈఫిల్ టవర్‌పై నిద్రపోయిన టూరిస్టులు
- ఆదివారం రాత్రి టిక్కెట్టు కొనుక్కుని టవర్ ఎక్కిన అమెరికా టూరిస్టులు
- కిందకు వచ్చే సమయంలో సిబ్బందిని బురిడీ కొట్టించి నిషేధిత ప్రాంతంలోకి ఎంట్రీ
- తాగిన మైకంలో కన్‌ఫ్యూజ్ అయి కిందకు రాలేక అక్కడే నిద్రించిన వైనం
- మరుసటి ఉదయం గాఢనిద్రలో ఉన్న వారిని గుర్తించిన సిబ్బంది
- నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆదివారం రాత్రి టవర్‌ను చూసేందుకు వారు టిక్కెట్లు కొనుగోలు చేశారు. అయితే, కిందకు వచ్చే క్రమంలో వారు సిబ్బంది కళ్లుకప్పి అక్కడున్న బేరియర్లను దాటుకుని నిషేధిత ప్రాంతంలోకి వెళ్లారు. చివరకు కిందకు ఎలా రావాలో తెలీక అక్కడే రాత్రంతా గడిపారు. అత్యవసర సిబ్బంది సాయంతో వారిని జాగ్రత్తగా కిందకు దింపిన అనంతరం, ప్యారిస్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.