సచిన్ మరో రికార్డు బ్రేక్ చేసిన జో రూట్.. 23 వేల పరుగులతో సంచలనం!
- 23 వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన జో రూట్
- 521 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయి
- సచిన్ 522 ఇన్నింగ్స్‌ల రికార్డు అధిగమించిన రూట్
- 490 ఇన్నింగ్స్‌లతో కోహ్లీ అగ్రస్థానంలో
- 23 వేల పరుగులు చేసిన తొలి ఇంగ్లండ్ బ్యాటర్
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 23 వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న రెండో బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. శ్రీలంకతో డర్హామ్‌లో మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఈ ఘనత సాధించాడు.
23 వేల పరుగులు పూర్తి చేసేందుకు రూట్‌కు మరో మూడు పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. ఈ దశలో అద్భుతమైన ఫ్లిక్ షాట్‌తో బౌండరీ బాది మైలురాయిని అందుకున్నాడు. 521వ అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. దీంతో 522 ఇన్నింగ్స్‌ల్లో 23 వేల పరుగులు పూర్తి చేసిన భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను వెనక్కి నెట్టాడు. 490 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్క్‌ను అందుకున్న విరాట్ కోహ్లీ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో 23 వేల పరుగులు చేసిన ఎనిమిదో బ్యాటర్‌గా రూట్ నిలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. సచిన్, కోహ్లీ, రాహుల్ ద్రవిడ్, కుమార సంగక్కర, మహేల జయవర్ధనే, రికీ పాంటింగ్, జాక్వెస్ కలిస్ ఈ జాబితాలో ఉన్నారు.
రూట్ ఇప్పటికే టెస్టు క్రికెట్‌లో సచిన్ పేరుతో ఉన్న పలు రికార్డులను అధిగమించాడు. ఇటీవల టెస్టుల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా సచిన్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.
ఇప్పుడు క్రికెట్ అభిమానుల దృష్టి మరో భారీ రికార్డుపై ఉంది. టెస్టుల్లో అత్యధిక పరుగుల సచిన్ రికార్డును రూట్ అధిగమిస్తాడా అన్నదే ఆసక్తికరంగా మారింది. సచిన్ 15,921 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. రూట్ 14,278 పరుగులతో ఉన్నాడు. ఇద్దరి మధ్య 1,643 పరుగుల తేడా ఉంది.
డిసెంబరులో 36వ ఏట అడుగుపెట్టనున్న రూట్.. ఇప్పటికీ నిలకడగా రాణిస్తున్నాడు. టెస్టుల్లో సచిన్ ఆడిన 200 మ్యాచ్‌ల రికార్డుకు రూట్ మరో 31 మ్యాచ్‌ల దూరంలో ఉన్నాడు.
టెస్టుల్లో రూట్ గొప్పతనం అందరికీ తెలిసిందే. అయితే వన్డేల్లో అతడి గణాంకాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. తొలి శ్రీలంక వన్డేకు ముందు రూట్ 7,826 పరుగులు చేశాడు. 51కి పైగా సగటుతో పాటు 20 సెంచరీలు సాధించాడు. వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇప్పటికే రికార్డు అతడి పేరిట ఉంది.