నేను హీరోగా చేస్తే, హీరోయిన్ గా శ్రీలీల అయితే బాగుంటుంది: బ్రహ్మాజీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను హీరోగా చేస్తే, హీరోయిన్ గా శ్రీలీల అయితే బాగుంటుంది: బ్రహ్మాజీ

Brahmaji Interview
  • బ్రహ్మాజీ తనయుడి రెండో సినిమాగా 'స్లమ్ డాగ్ హస్బెండ్'
  • ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు 
  • 27వ తేదీన జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • ఈవెంటుకి శ్రీలీల వస్తుందని చెప్పిన బ్రహ్మాజీ  
హీరోగా .. కేరక్టర్ ఆర్టిస్టుగా బ్రహ్మాజీకి మంచి పేరు ఉంది. ఆయన తనయుడు సంజయ్ రావు ' ఓ పిట్టకథ' సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన సంగతి తెలిసిందే. ఆయన రెండో సినిమాగా 'స్లమ్ డాగ్ హస్బెండ్' రూపొందింది. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో బ్రహ్మాజీ కూడా బిజీగా ఉన్నాడు.

సాక్షి టీవీకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రహ్మాజీ మాట్లాడాడు.  "మళ్లీ మీకు హీరోగా చేసే ఛాన్స్ వస్తే, హీరోయిన్ గా మీ పక్కన ఎవరు చేయాలనుకుంటారు?" అనే ప్రశ్న బ్రహ్మాజీకి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "శ్రీలీల అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. తను డాన్స్ చాలా బాగా చేస్తుంది .. నాకు రాదనీ అనుకుంటున్నారేమో .. నేను కూడా బాగానే చేస్తాను" అన్నాడు. 

"శ్రీలీల చాలా ఫాస్టుగా స్టార్ డమ్ ను అందుకుంది. ఆమె ఎనర్జీ లెవెల్స్ చూస్తుంటే, జయప్రద - శ్రీదేవి రేంజ్ కి వెళుతుందని మొన్నీమధ్య ఒక పెద్ద ప్రొడ్యూసర్ నాతో అన్నారు. మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 27వ తేదీన జరగనుంది. ఈవెంటుకి శ్రీలీల వస్తుంది .. ఆమెతో కలిసి అప్పుడు డాన్స్ చేస్తాను .. చూద్దురుగానీ'' అంటూ నవ్వేశారు . 

Advertisement
Brahmaji
Sanjay Rao
Slum Dog Husband

More Telugu News