ఫ‌న్ రైడ‌ర్‌గా సంతోష్ శోభ‌న్ ‘ప్రేమ్ కుమార్’ .. ఆకట్టుకుంటోన్న ట్రైలర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫ‌న్ రైడ‌ర్‌గా సంతోష్ శోభ‌న్ ‘ప్రేమ్ కుమార్’ .. ఆకట్టుకుంటోన్న ట్రైలర్

Prem Kumar Trailer Released
  • 'ప్రేమ్ కుమార్' గా సంతోష్ శోభన్ 
  • కథానాయికలుగా రాశి సింగ్ - రుచిత 
  • దర్శకుడిగా అభిషేక్ మహర్షి పరిచయం
  • ఆగస్టు 18వ తేదీన సినిమా రిలీజ్
టాలీవుడ్‌లో కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫ‌రెంట్ మూవీస్‌తో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో సంతోష్ శోభ‌న్, 'ప్రేమ్‌కుమార్‌' గా న‌వ్వుల్లో ముంచెత్త‌టానికి సిద్ధ‌మవుతున్నాడు. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న ఈ సినిమాతో, ఈ చిత్రం ద్వారా అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాశీ సింగ్ - రుచిత సాధినేని హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

 కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా నుంచి, కొంతసేపటి క్రితం ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. ప్రేమ్ కుమార్ వ్య‌థ పేరుతో ఈ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌టం ఆసక్తిక‌రంగా ఉంది. హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ను ఆస‌క్తిక‌రంగా మ‌లిచారు. హీరో పెళ్లి చేసుకోవాల‌నుకుంటాడు. కానీ ఏదో ఒక కార‌ణంతో అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. దాంతో అందరూ హీరోని ఆట ప‌ట్టిస్తుంటారు. చివ‌ర‌కు విసిగిపోయిన హీరో పెళ్లి చేసుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించుకుంటాడు. 

అప్పుడు అత‌ని జీవితంలోకి హీరోయిన్ అడుగుపెడుతుంది. వారి పరిచ‌యం ఎలా జరుగుతుంది? ఆమెతో అయినా అతని పెళ్లి జరుగుతుందా? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కథలో ట్విస్టులు మీద ట్విస్టులు ఆస‌క్తికంగా ఉన్నాయి. టీజర్ ను మించిన  ఎంట‌ర్‌టైన్మెంట్‌తో మిక్స్ చేసి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆగస్టు 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Advertisement
Santhosh Sobhan
Rashi Singh
Ruchitha
Prem Kumar Movie

More Telugu News