ఆ మాత్రం రైలు వ్యాగన్లు తయారుచేసే సత్తా మాకు కూడా ఉంది: మంత్రి జగదీశ్ రెడ్డి
- వరంగల్ కు వచ్చి మోదీ ఇచ్చిందేమీ లేదన్న జగదీశ్ రెడ్డి
- అవినీతికి రారాజు బీజేపీ అని విమర్శ
- కేసీఆర్ కీర్తి ఢిల్లీకి పాకుతుందని మోదీ భయపడుతున్నారని ఎద్దేవా
అవినీతిలో కాంగ్రెస్ ను బీజేపీ మించిపోయిందని జగదీశ్ రెడ్డి విమర్శించారు. అవినీతికి రాజు కాంగ్రెస్ అయితే... రారాజు బీజేపీ అని చెప్పారు. గుజరాత్ లో కూలిన బ్రిడ్జిలే బీజేపీ అవినీతికి సాక్ష్యమని అన్నారు. తెలంగాణ కంటే గుజరాత్ లో అవినీతి ఎక్కువని... అయినప్పటికీ అక్కడకు ఈడీ, సీబీఐ ఎందుకు వెళ్లవని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని... అందుకే ఇక్కడ బీజేపీకి స్థానం లేదని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ లు ఈ దేశాన్ని నాశనం చేశాయని మండిపడ్డారు.