మెగా ఫ్యామిలీకి కండిషన్స్ పెట్టిన లావణ్య త్రిపాఠి?
- ఇటీవల ఘనంగా జరిగిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల ఎంగేజ్ మెంట్
- స్టేజ్ పై భరతనాట్యం చేసే అవకాశం వస్తే అడ్డు చెప్పకూడదంటూ లావణ్య కండిషన్
- నిర్మాతగా సినిమాలను నిర్మిస్తానని చెప్పినట్టు సమాచారం
లావణ్యకు భరతనాట్యం అంటే చాలా ఇష్టం. పెళ్లైన తర్వాత కూడా తనకు స్టేజ్ పైన భరతనాట్యం చేసే అవకాశం వస్తే అడ్డు చెప్పకూడదనే కండిషన్ ఆమె పెట్టిందట. పెళ్లి తర్వాత నటనకైతే దూరంగా ఉంటాను కానీ... ప్రొడక్షన్ వైపు మాత్రం వెళ్తానని చెప్పిందట. నిర్మాతగా సినిమాలను నిర్మిస్తానని కండిషన్ పెట్టిందట. దీనికి వరుణ్ తేజ్ తో పాటు, మెగా ఫ్యామిలీ ఒప్పుకుందని చెపుతున్నారు. మరోవైపు వీరి పెళ్లి డిసెంబర్ లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.