క్రేజీ కాంబినేషన్.. విజయ్ దేవరకొండ సరసన పూజ హెగ్డే!
- పరుశురాం చిత్రంలో హీరోయిన్ గా పూజ ఎంపికైనట్టు వార్తలు
- ప్రస్తుతం మహేశ్ సరసన ‘గుంటూరు కారం‘లో నటిస్తున్న పూజ
- మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత టాలీవుడ్ లో వరుస ఫ్లాప్ లు
వరుస ఫ్లాప్స్ ఖాతాలో పడినప్పటికీ టాలీవుడ్ లో ఆమెకు భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రంలో పూజ హీరోయిన్ గా ఎంపికయిందని సమచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే తెలుగులో మరో ఆసక్తికరమైన జోడీ ప్రేక్షకులను అలరించనుంది. కాగా, పూజ హెగ్డే ప్రసత్తం మహేశ్ బాబు సరసన ‘గుంటూరు కారం’ చిత్రంలో నటిస్తోంది.