గోపీచంద్ పై ఇప్పుడు వినిపిస్తున్న రూమర్ ఇదే!

Gopichand Special
  • కొంతకాలంగా సక్సెస్ కి దూరంగా ఉన్న గోపీచంద్ 
  • రీసెంట్ గా వచ్చిన 'రామబాణం' మిగిల్చింది కూడా నిరాశనే 
  • పారితోషికం తగ్గించుకోనున్నాడంటూ రూమర్ 
  • విలన్ పాత్రల పట్ల ఆసక్తిని చూపుతున్నాడని టాక్
గోపీచంద్ హిట్ అనే మాట విని చాలా కాలమైంది. ఆ మధ్య చేసిన 'పక్కా కమర్షియల్' తప్పకుండా తనకి హిట్ తెచ్చిపెడుతుందని గోపీచంద్ భావించాడు. కానీ ఆ సినిమా అభిమానులను నిరాశపరిచింది. ఆ తరువాత చేసిన 'రామబాణం' సినిమాపై కూడా ఆయన మరింత గట్టి నమ్మకాన్ని ఉంచుతూ వచ్చాడు. 

ఈ సినిమాకి శ్రీవాస్ దర్శకత్వం వహించాడు. గతంలో ఆయన కాంబినేషన్లో చేసిన 'లక్ష్యం' .. 'లౌక్యం' భారీ విజయాలను అందుకున్నాయి. అందువలన ఈ సారి హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమని ఆయన అనుకున్నాడు. కానీ ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. చాలా తక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకుని, గోపీచంద్ ను ఆలోచనలో పడేసింది. 

దాంతో ఇకపై తన పారితోషికాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో గోపీచంద్ ఉన్నాడని అంటున్నారు. తన సన్నిహితులతో చర్చించే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడని చెబుతున్నారు. ఇక స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రలను చేయడానికి ఆయన సుముఖంగా ఉన్నాడంటూ ఒక రూమర్ బలంగానే వినిపిస్తోంది. చూడాలి మరి గోపీచంద్ ఏం చేస్తాడో. 

Advertisement
Gopichand
Dimple Hayathi
Ramabanam Movie

More Telugu News