ఇయర్ బడ్స్ విషయంలోనే అజయ్ సాయి హత్య జరిగింది: విజయవాడ సీపీ
- పెనమలూరు వద్ద యువకుడి హత్య
- స్నేహితులే హంతకులు
- నిందితులు గంజాయి మత్తులో లేరన్న సీపీ
- ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశామని వెల్లడి
ఇయర్ బడ్స్ విషయంలోనే అజయ్ సాయి హత్య జరిగిందని తెలిపారు. అజయ్ సాయిపై స్నేహితులే దాడి చేశారని వివరించారు. హత్య జరిగినప్పుడు నిందితులు గంజాయి మత్తులో లేరని సీపీ స్పష్టం చేశారు. హత్య కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశామని చెప్పారు. మరో ముగ్గురు నిందితుల కోసం నాలుగు బృందాలతో గాలింపు చేపడుతున్నట్టు వెల్లడించారు. నిందితులపై గతంలోనూ కేసులున్నాయని తెలిపారు.