బీటెక్ అర్హతతో ఇస్రోలో ఉద్యోగాలు
- 65 సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ
- కనీసం 60 శాతం మార్కులతో పాస్ తప్పనిసరి
- దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు ఈ నెల 24
దరఖాస్తు చేయడానికి కావాల్సిన అర్హతలు..
పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్ తో కనీసం 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్, బీఆర్క్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: అభ్యర్థుల వయసు మే 24, 2023వ తేదీ నాటికి 28 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తు విధానం, గడువు: ఆన్ లైన్ లో మే 24 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ రూ.250లు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చెల్లించేందుకు తుది గడువు మే 26.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
జీతం: ఎంపికైన వారికి నెలకు రూ.56,100 లు చెల్లిస్తారు.
ఖాళీల వివరాలు..
సైంటిస్ట్/ఇంజనీర్ ‘ఎస్‌సీ’ (సివిల్) పోస్టులు: 39
సైంటిస్ట్/ ఇంజనీర్ ‘ఎస్‌సీ ‘ (ఎలక్ట్రికల్) పోస్టులు: 14
సైంటిస్ట్/ ఇంజనీర్ ‘ఎస్‌సీ’ (రిఫ్రిజెరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్) పోస్టులు: 9
సైంటిస్ట్/ ఇంజనీర్ ‘ఎస్‌సీ’ (ఆర్కిటెక్చర్) పోస్టులు: 1
సైంటిస్ట్/ ఇంజనీర్ ‘ఎస్‌సీ’ (సివిల్)- అటానమస్ బాడీ- పీఆర్‌ఎల్ పోస్టులు: 1
సైంటిస్ట్/ ఇంజనీర్ ‘ఎస్‌సీ’ (ఆర్కిటెక్చర్)- అటానమస్ బాడీ- పీఆర్‌ఎల్ పోస్టులు: 1