Nadendla Manohar: పవన్, చంద్రబాబు మధ్య భవిష్యత్తులో మరిన్ని సమావేశాలు ఉంటాయి: నాదెండ్ల మనోహర్

Nadendla Manohar says more meetings to come between Pawan Kalyan and Chandrababu
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాదులో నిన్న టీడీపీ అధినేత చంద్రబాబును జనసేనాని పవన్ కల్యాణ్ కలవడం తెలిసిందే. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, వైసీపీ ప్రభుత్వ విధానాలపై పోరాటం తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ భేటీ నేపథ్యంలో, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. 

రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఇరువురి భేటీ అవశ్యం అని అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు మధ్య భవిష్యత్తులో మరిన్ని సమావేశాలు ఉంటాయని తెలిపారు. రాబోయే ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నామని వెల్లడించారు. 

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం జనసేన కృషి చేస్తుందని, తమ నినాదం కూడా అదేనని నాదెండ్ల వివరించారు. నిన్న చంద్రబాబుతో భేటీలో తమ అజెండా అదేనని వివరణ ఇచ్చారు. సరైన ప్రణాళిక, వ్యూహంతో జనసేన ముందుకు కదులుతోందని నాదెండ్ల పేర్కొన్నారు. 

సీఎం జగన్ పట్ల ప్రజల్లో నమ్మకం పోయిందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలమయ్యాయని విమర్శించారు. విశాఖలో భూ దందాలపై జనసేన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Nadendla Manohar
Pawan Kalyan
Chandrababu
Janasena
TDP
Andhra Pradesh

More Telugu News