'అఖండ' నుంచి అదే పద్ధతిని ఫాలో అవుతున్న బోయపాటి!
- 'అఖండ' రిలీజ్ వరకూ పెద్దగా మాట్లాడని బోయపాటి
- బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా ఓ సంచలనం
- రామ్ సినిమా విషయంలోను అదే పద్ధతి
- ఆ స్థాయి హిట్ కోసం తన పనిలో నిమగ్నమైన బోయపాటి
చరణ్ హీరోగా బోయపాటి తెరకెక్కించిన 'వినయ విధేయ రామ' మెగా అభిమానులను చాలా నిరాశ పరిచింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, నష్టాలను చవిచూసింది. ఈ సినిమా గురించి బోయపాటి చెప్పిన మాటలను చాలా కాలం పాటు ట్రోల్ చేశారు. ఇక అప్పటి నుంచి ఆయన తన సినిమాల గురించి ముందుగా మాట్లాడటం మానేశారు.
బాలయ్యతో అంతటి 'అఖండ' చేస్తున్నప్పుడు కూడా ఆయన ఎక్కువగా మాట్లాడలేదు. రిలీజ్ తరువాత మాట్లాడతా అంటూనే దాటవేస్తూ వచ్చారు. అఖండ విజయాన్ని సాధించిన తరువాతనే తనదైన స్టైల్లో మాట్లాడారు. అదే పద్ధతిని ఇప్పుడు రామ్ సినిమా విషయంలోను ఫాలో అవుతున్నారు. ఈ సినిమా గురించి కూడా ఆయన ఎక్కడా ఏమీ మాట్లాడటం లేదు. సైలెంట్ గా తన పని తాను చేసుకుని పోతున్నారు. ఈ సారి కూడా బోయపాటి తన సినిమాతోనే మాట్లాడిస్తారన్న మాట!