ఎన్టీఆర్ నివాసంలో విందుకు హాజరైన అమెజాన్ స్టూడియోస్ ఉపాధ్యక్షుడు... ఫొటోలు ఇవిగో!
- గత రాత్రి ఎన్టీఆర్ నివాసంలో ప్రత్యేక విందు
- హాజరైన జేమ్స్ ఫర్రెల్
- విందుకు విచ్చేసిన రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల
- ఫొటోలను పోస్టు చేసిన ఎన్టీఆర్
కాగా, ఎన్టీఆర్ సన్నిహితుడు రామ్ చరణ్ ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్నందున ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని తెలుస్తోంది. ఈ విందుకు సంబంధించిన ఫొటోలను ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
సాయంత్రం వేళ స్నేహితులు, శ్రేయోభిలాషులతో హాయిగా గడిచిపోయిందని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. జేమ్స్, ఎమిలీ ఈ విందుకు హాజరు కావడం సంతోషదాయకమని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం విందుకు హాజరైనందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. అభిమానులను ఈ ఫొటోలు విశేషంగా అలరిస్తున్నాయి.


