ఢిల్లీలో పవన్, నాదెండ్ల... ఏపీ బీజేపీ ఇన్చార్జితో భేటీ
- ఏపీలో మొదలైన ఎన్నికల సన్నాహాలు
- ఢిల్లీ పర్యటనకు వెళ్లిన పవన్
- రోడ్ మ్యాప్ కోసం బీజేపీ హైకమాండ్ తో చర్చించే అవకాశం
ఈ నేపథ్యంలో, పవన్ నేడు ఢిల్లీలో ఏపీ బీజేపీ ఇన్చార్జి మురళీధరన్ తో సమావేశమయ్యారు. ఈ భేటీలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. జనసేన-బీజేపీ ఉమ్మడి కార్యాచరణపైనా చర్చిస్తున్నట్టు సమాచారం.