భారత వ్యతిరేక నిరసనలపై కేంద్రం సీరియస్.. కెనడా హై కమిషనర్ కు సమన్లు
- అసలు అలాంటి కార్యకలాపాలకు ఎందుకు అనుమతించారు?
- సూటిగా ప్రశ్నించిన విదేశాంగ శాఖ
- నేరస్థులను గుర్తించి, విచారించాలని డిమాండ్
‘‘అసలు ఈ తరహా కార్యకలాపాలకు ఎందుకు అనుమతించారు. పోలీసుల సమక్షంలోనే మా డిప్లొమాటిక్ మిషన్లు, కాన్సులేట్ల వద్ద భద్రతను ఉల్లంఘించారు’’అని పేర్కొంటూ దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. భారత దౌత్య కార్యాలయాలు, కాన్సులేట్ వద్ద భద్రతకు భరోసానిచ్చేందుకు కావాల్సిన అన్ని చర్యలను కెనడా సర్కారు తీసుకుంటుందని భావిస్తున్నట్టు విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.