కుర్ర హీరోయిన్ రాణి స్వర్ణకార్‌తో కలిసి గోవిందా సందడి.. లాల్‌బాగ్చా వినాయకుడికి పూజలు

కుర్ర హీరోయిన్ రాణి స్వర్ణకార్‌తో కలిసి గోవిందా సందడి.. లాల్‌బాగ్చా వినాయకుడికి పూజలు

Govinda visits Lalbaugcha Raja with young actress Rani Swarnakar for prayers
  • కొత్త నటి రాణి స్వర్ణకార్‌తో కలిసి గణేశుడిని దర్శించుకున్న గోవిందా
  • కూతురి వయసున్న అమ్మాయితో తిరగడానికి సిగ్గుండాలంటూ భార్య సునీత ఆగ్రహం
  • ఆరోపణలపై ఘాటుగా స్పందించిన గోవిందా... పరిమితుల్లో ఉండాలని వార్నింగ్
  • 'రూపా' సినిమాతో గోవిందా రీ-ఎంట్రీకి రెడీ 
నూతన నటి రాణి స్వర్ణకార్‌తో  చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవిందా మరోమారు ఆమెతో కలిసి సందడి చేశాడు. తాజాగా ముంబైలోని ప్రఖ్యాత లాల్‌బాగ్చా గణేశుడిని దర్శించుకున్న ఆయన.. రాణితో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొనడం మరోమారు చర్చనీయాంశమైంది. 

గోవిందా తెల్లటి సంప్రదాయ దుస్తుల్లో కనిపించగా.. రాణి ఎరుపు, ఆకుపచ్చ రంగుల డ్రెస్‌లో దర్శనమిచ్చింది. ఇద్దరూ కలిసి గణపతికి ప్రత్యేక పూజలు చేసి, హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పర్యటన వారిద్దరి మధ్య ఉన్న సంబంధంపై వస్తున్న ఆరోపణలకు మరింత బలాన్నిచ్చింది.

గోవిందా తనను మోసం చేస్తున్నాడని, రాణితో ప్రేమాయణం నడుపుతున్నాడని ఆయన భార్య సునీత అహుజా ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. 62 ఏళ్ల వయసులో కూతురి వయసున్న అమ్మాయితో తిరగడానికి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే, రాణి దుస్తుల గురించి కూడా ఆమె ఎగతాళి చేస్తూ వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలపై గోవిందా కూడా అంతే తీవ్రంగా స్పందించాడు.

"మీ వెనుక ఉన్న గ్రూప్, ఆ గ్యాంగ్ గురించి అందరికీ తెలుసు. ఆ పరిచయం మున్ముందు బయటకు వస్తుంది. కాబట్టి అది మీకు కూడా మంచిది కాదు. భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో నా అవసరం మీకు తప్పకుండా ఉంటుంది. దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు. ఈ పాడ్‌కాస్టులు, అవమానాలు ఆపి మీ పరిమితుల్లో మీరు ఉండండి" అని భార్యను గట్టిగా హెచ్చరించాడు.

'రూపా' చిత్రంతో గోవిందా మళ్లీ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా హీరోయిన్‌గా నటిస్తున్న రాణి స్వర్ణకర్‌ను జులైలో మీడియాకు పరిచయం చేసినప్పటి నుంచే ఈ వివాదం మొదలైంది. గతంలో 'లాక్ అప్' రియాలిటీ షోలో సునీత పాల్గొన్నప్పుడు ఆమెకు మద్దతుగా నిలిచిన గోవిందా, ఇప్పుడు ఆమె ఆరోపణలతో చిక్కుల్లో పడ్డాడు.
Advertisement
Govinda
Rani Swarnakar
Sunita Ahuja
Lalbaugcha Raja
Bollywood News
Roopa Movie

More Telugu News