ఇంత దారుణమా?.. నిరసన మొదలవకముందే భారీ ప్రాణనష్టానికి సిద్ధమైన పాక్ ప్రభుత్వం!
- సెప్టెంబర్ 27న ఇస్లామాబాద్‌లో పీటీఐ భారీ నిరసనకు పిలుపు
- భారీ ప్రాణనష్టం పరిస్థితులపై సిద్ధంగా ఉండాలని ఆసుపత్రులకు ప్రభుత్వం ఆదేశాలు
- సర్జరీలు వాయిదా.. వైద్య సిబ్బంది సెలవుల రద్దు
- బెడ్లు ఖాళీ చేసేందుకు కొందరు రోగుల డిశ్చార్జి
- ఇమ్రాన్ సోదరీమణులు ముగ్గురి నిర్బంధం
ఇస్లామాబాద్‌లో సెప్టెంబర్ 27న పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ భారీ నిరసనకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిరసన సమయంలో భారీగా క్షతగాత్రులు వచ్చే పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశించినట్లు ‘డ్రాప్‌సైట్ న్యూస్’ నివేదించింది.
నిరసనకు ముందే ఆసుపత్రుల్లో అత్యవసర ఏర్పాట్లు మొదలయ్యాయి. షెడ్యూల్ చేసిన కొన్ని సర్జరీలను వాయిదా వేసినట్లు సమాచారం. భారీ సంఖ్యలో క్షతగాత్రులు వస్తే చికిత్స అందించేలా సర్జికల్ విభాగాలను పునర్వ్యవస్థీకరించాలని ఆదేశించినట్లు నివేదిక పేర్కొంది. వైద్యులు, నర్సులు, పారామెడికల్, పరిపాలనా సిబ్బందికి సెలవులు నిలిపివేశారు. ఇప్పటికే సెలవులో ఉన్న సిబ్బందిని కూడా వెంటనే విధులకు రావాలని ఆదేశించారు.
బెడ్ల కొరత రాకుండా ఆరోగ్యం నిలకడగా ఉన్న కొందరు రోగులను డిశ్చార్జి చేస్తున్నట్లు సమాచారం. అంటే నిరసన ఇంకా ప్రారంభం కాకముందే పాక్ హాస్పిటళ్లలో భారీగా క్షతగాత్రులు వచ్చే పరిస్థితిని ఊహించి ఏర్పాట్లు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇదే సమయంలో పీటీఐ నేతలు, కార్యకర్తలపై పాక్ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్, నోరీన్ నియాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి పిల్లలను కూడా కొంతసేపు అదుపులోకి తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. 24 గంటల్లో ఇమ్రాన్ కుటుంబానికి చెందిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు నివేదిక పేర్కొంది.
ముగ్గురు సోదరీమణులపై 30 రోజుల నిర్బంధ ఉత్తర్వులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. లాహోర్ డిప్యూటీ కమిషనర్ సెప్టెంబర్ 20న ‘మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్’ చట్టం కింద ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎలాంటి ప్రజా సమావేశం లేదా శాంతిభద్రతలకు ముప్పు లేని సమయంలోనే అలీమా ఖాన్‌ను అరెస్టు చేశారని ఆమె కుమారుడు ఆరోపించారు.
మరోవైపు దేశవ్యాప్తంగా పలువురు పీటీఐ నేతలను అరెస్టు చేయడంతో పాటు వారి ఇళ్లపై దాడులు జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో 2024 నవంబర్‌లో జరిగిన పీటీఐ నిరసనల సమయంలోనూ పాక్ భద్రతా బలగాలు కాల్పులు జరిపి పలువురు నిరసనకారులను చంపినట్లు ‘డ్రాప్‌సైట్ న్యూస్’ ఆరోపించింది. ఆ ఘటనలో మృతుల సంఖ్యను ప్రభుత్వం పూర్తిగా వెల్లడించలేదని కూడా ఆ సంస్థ పేర్కొంది.
ఇప్పుడు సెప్టెంబర్ 27న మరో భారీ నిరసనకు పీటీఐ సిద్ధమవుతున్న వేళ హాస్పిటళ్లకు ముందుగానే భారీ ప్రాణనష్టం పరిస్థితులను ఎదుర్కొనేలా ఆదేశాలు రావడం పాక్‌లో రాజకీయ ఉద్రిక్తత ఏ స్థాయికి చేరిందో చూపిస్తోందన్న చర్చ జరుగుతోంది. ఇమ్రాన్ ఖాన్ సోదరీమణుల అరెస్టులపై ఆయన కుమారుడు ఖాసిమ్ ఖాన్ కూడా తీవ్రంగా స్పందించారు. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని కోరారు.