గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై గౌతం సవాంగ్ కు నారా లోకేశ్ లేఖ
- గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 85 రోజుల సమయం చాలదని లోకేశ్ లేఖ
- ఏడు పేపర్లు ప్రిపేర్ కావడానికి సమయం చాలదని వివరణ
- మరో మూడు నెలల సమయాన్ని పొడిగించాలని సూచన
మెయిన్స్ పరీక్షకు అన్ని అంశాలలో అవసరమైన లోతైన జ్ఞానం, లోతైన విశ్లేషణ చేసేందుకు ఈ మూడు నెలల సమయం సరిపోదని వివరించారు. మెయిన్స్ పరీక్షకు మరో మూడు నెలల అదనపు సమయం పొడిగించాలని గౌతం సవాంగ్ ను కోరారు. కొత్తవారితో పాటు, ఉద్యోగాలు చేసుకుంటూ గ్రూప్-1 రాసేవారికి ఈ అదనపు సమయం ప్రిపేర్ కావడానికి ఎంతో ఉపయోగపడుతుందని లోకేశ్ అభిప్రాయపడ్డారు.