Advertisement

మార్చి 14 నుంచి పాదయాత్ర కొనసాగిస్తాను: లోకేశ్

Lokesh says he will continue Yuvagalam from March 14
  • ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు
  • ఎన్నికల నియమావళి కారణంగా లోకేశ్ పాదయాత్రకు విరామం
  • ఈ నెల 12, 13 తేదీల్లో పాదయాత్ర ఉండదన్న లోకేశ్
ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి కారణంగా యువగళం పాదయాత్ర నిలిచిపోవడంపై నారా లోకేశ్ స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా యువగళం పాదయాత్రకు ఈ నెల 12, 13 తేదీల్లో విరామం ప్రకటించానని వెల్లడించారు. ఈ నెల 14వ తేదీ నుంచి యథావిధిగా పాదయాత్ర కొనసాగిస్తానని తెలిపారు. 

ఇవాళ యువగళం పాదయాత్రకు 41వ రోజు అని, తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం నందిరెడ్డివారిపల్లి విడిది కేంద్రం నుంచి ప్రారంభమైందని లోకేశ్ పేర్కొన్నారు. టీడీపీ చేసిన అభివృద్ధి-పెద్దిరెడ్డి కుటుంబ అవినీతిపై చర్చకు సిద్ధం అంటూ నేను విసిరిన సవాల్ కు స్పందించని పిరికిపందలు పాదయాత్రకు అడ్డంకులు కల్పించినా వెనుకడుగు వేయలేదని స్పష్టం చేశారు.
Advertisement
Nara Lokesh
Yuva Galam Padayatra
TDP
Andhra Pradesh

More Telugu News