సిసోడియాకు వారం రోజుల ఈడీ కస్టడీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సిసోడియాకు వారం రోజుల ఈడీ కస్టడీ

Court allows ED custody for Manish Sisodia
  • లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ ఆరోపణలు
  • నిన్న సిసోడియాను అరెస్ట్ చేసిన ఈడీ
  • నేడు కోర్టులో హాజరు
  • సిసోడియాను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలన్న ఈడీ
  • అనుమతి నిచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిన్న అరెస్ట్ చేసిన మనీశ్ సిసోడియాను ఈడీ అధికారులు నేడు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈడీ విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం సిసోడియాకు వారం రోజుల కస్టడీ విధించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిసోడియాను ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో, ఈడీ అధికారులు సిసోడియాను నిన్న అదుపులోకి తీసుకున్నారు. ఆయనను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలని ఈడీ కోర్టుకు విన్నవించింది. ఈడీ విజ్ఞప్తికి కోర్టు సమ్మతిస్తూ, సిసోడియాను కస్టడీకి అప్పగించింది. అనంతరం, తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది.
Advertisement
Manish Sisodia
ED
Custody
Court
Delhi Liquor Scam

More Telugu News