ఏపీలోని ఆ జిల్లాల్లో 3 రోజులపాటు వైన్స్ బంద్
- ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎక్సైజ్ శాఖ ఆదేశాలు
- విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో మూతపడనున్న మద్యం దుకాణాలు
- ఈ నెల 11 నుంచి 13 వ తేదీ వరకు క్లోజ్
దీంతో మూడు జిల్లాల్లోని మద్యం దుకాణలు మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆదేశాల మేరకు ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం డిపోలతో పాటు స్టార్ హోటళ్లు, టూరిజం బార్‌లు, నేవల్ క్యాంటీన్లలో మద్యం అమ్మకాలను నిషేధిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఓట్ల లెక్కింపు జరిగే 16వ తేదీన కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో మద్యం దుకాణాలను బంద్ చేయాలని ఉత్తర్వుల్లో తెలిపారు.