తెలుగు ప్రజల మనసు బంగారం... ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన చంద్రబాబు
- విశాఖలో యువకుడికి సాయం చేసిన రాపిడో డ్రైవర్
- వీడియోను షేర్ చేసి తెలుగు వారిని ప్రశంసించిన సీఎం చంద్రబాబు
- ‘తెలుగు ప్రజల హృదయాలు బంగారం లాంటివి’ అని కామెంట్
- ఆకలితో ఉన్న యువకుడికి దోశ కూడా ఇప్పించిన డ్రైవర్
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మానవతా దృశ్యం
అవసరంలో ఉన్న ఓ యువకుడికి విశాఖపట్నంలో ఓ తెలుగు వ్యక్తి చేసిన సహాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో పంచుకుంటూ తెలుగు ప్రజల గొప్ప మనసును ప్రశంసించారు. "తెలుగు ప్రజల హృదయాలు బంగారం లాంటివి" (Telugu people have hearts of gold) అని ఆయన ఈ పోస్టుకు క్యాప్షన్ జోడించారు.
వివరాల్లోకి వెళితే, విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వెళ్లాల్సిన ఓ యువకుడు రాత్రిపూట 2.12 గంటల వేళ బస్ పాయింట్‌కు దూరంగా ఉండిపోయాడు. తాను బస్సు ఎక్కాల్సిన ప్రదేశానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో రాపిడో బుక్ చేసుకున్నాడు. ఆ యువకుడు బస్సు ఎక్కాల్సిన సమయం 3.30 గంటలు. ఇంతలో అక్కడికి వచ్చిన రాపిడో డ్రైవర్, ఆ సమయంలో చార్జీలు ఎక్కువగా ఉంటాయని, బస్సు లేదా ఆటో దొరికే వరకు తాను తోడుగా ఉంటానని యువకుడికి భరోసా ఇచ్చాడు.
ఎంతసేపటికీ ఇతర వాహనాలేవీ రాకపోవడంతో, ఆ డ్రైవరే స్వయంగా యువకుడిని బస్ పాయింట్ వద్ద డ్రాప్ చేసేందుకు ముందుకొచ్చాడు. అంతేకాదు, ఆకలితో ఉన్న ఆ యువకుడికి ఎగ్ దోశ కూడా ఇప్పించి తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఏపీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న స్కూటర్‌పై ఆ డ్రైవర్ చూపిన మానవత్వానికి ముగ్ధుడైన యువకుడు, ఈ సంఘటనను వీడియో తీసి పంచుకున్నాడు. మెహాఫుజ్ క్రెడిట్‌తో ఉన్న ఈ వీడియో, సీఎం చంద్రబాబు షేర్ చేయడంతో మరింత మందికి చేరింది. తెలుగు ప్రజల సహాయ గుణంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.