ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. ప్రజాస్వామ్యం పనిచేస్తోందన్న కమల్ హాసన్
- ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమన్న నటుడు కమల్ హాసన్
- విద్యా, పరీక్షల సంస్కరణలపై జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్
- నీట్-యూజీ పేపర్ లీక్ ఆరోపణలు, విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ఈ పరిణామం
నీట్-యూజీ వంటి పోటీ పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రి రాజీనామాను నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ స్వాగతించారు. ఘర్షణల కంటే చర్చల ద్వారానే ప్రజాస్వామ్యం సమర్థవంతంగా పనిచేస్తోందనడానికి ఇది ఒక నిదర్శనమని ఆయన అభివర్ణించారు.
శనివారం 'ఎక్స్' వేదికగా ఆయన స్పందిస్తూ, "సంఘర్షణల స్థానంలో చర్చలకు తావు లభించడం శుభపరిణామం. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిచెబుతోంది. గాంధీజీ నడయాడిన ఈ గడ్డపై పెల్లెట్ గన్లు, ఎలక్ట్రిక్ షాక్ లాఠీలకు తావు లేదు. అదే సమయంలో భద్రతా సిబ్బందిపై దాడులు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం వంటి ఘటనలపై నిష్పాక్షిక విచారణ జరగాలి. జవాబుదారీతనం అనేది కేవలం ఒక వర్గానికే పరిమితం కాకూడదు" అని పేర్కొన్నారు.
ఈ పరిణామం కేవలం ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదానికే పరిమితం కాకుండా, విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలకు నాంది పలకాలని కమల్ హాసన్ సూచించారు. పరీక్షలపై విద్యార్థుల్లో విశ్వసనీయతను పునరుద్ధరించడం, వారిపై ఒత్తిడిని తగ్గించడం మరియు వ్యవస్థను ఆధునికీకరించడమే లక్ష్యంగా మూడు నెలల కాలపరిమితితో కూడిన 'జాతీయ విద్యా, పరీక్షల సంస్కరణల కమిషన్'ను ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సంస్కరణల ప్రక్రియలో తమిళనాడు దృక్కోణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని, నీట్ వంటి పరీక్షల వల్ల కలిగే అనర్థాలకు విద్యార్థిని అనిత మరణమే తొలి హెచ్చరిక అని ఆయన గుర్తుచేశారు.
నీట్-యూజీ పేపర్ లీక్ ఆరోపణలపై కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరసనలు చేపట్టారు. ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు దిగడంతో ఈ ఆందోళనలు మరింత ఉద్ధృతమయ్యాయి. అన్ని వైపుల నుంచి వ్యక్తమైన తీవ్ర ఒత్తిడి కారణంగా ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.