థియేటర్లలో పెద్ద సర్‌ప్రైజ్ ఉంటుంది: 'న్యూటన్స్ థర్డ్ లా'పై హీరో సుమంత్
- సుమంత్ హీరోగా నటించిన 'న్యూటన్స్ థర్డ్ లా' థ్రిల్లర్ చిత్రం
- జులై 31న థియేటర్లలో విడుదల కానున్నట్టు ప్రకటన
- 'మళ్లీ రావా' తర్వాత సింగిల్ సిట్టింగ్‌లోనే ఈ కథను ఓకే చేశానన్న సుమంత్
- ఈ సినిమా థ్రిల్లర్ జానర్‌ను రీడిఫైన్ చేస్తుందని దర్శకుడు రాజేశ్ కర్ణ ధీమా
- ట్రైలర్ లాంచ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన హీరో అడివి శేష్
హీరో సుమంత్ ప్రధాన పాత్రలో, ఈటీవీ విన్ నిర్మాణంలో తెరకెక్కిన యూనిక్ థ్రిల్లర్ 'న్యూటన్స్ థర్డ్ లా'. రాజేశ్ కర్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జులై 31న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరో అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.
ట్రైలర్‌ను వీక్షించిన అనంతరం అడివి శేష్ మాట్లాడుతూ, "'న్యూటన్స్ థర్డ్ లా' ట్రైలర్ చాలా బాగుంది. ఒక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా అనిపిస్తోంది. దర్శకుడు రాజేశ్ నాకు మంచి స్నేహితుడు. సుమంత్ నా ఫేవరెట్ బ్రో. నా మొదటి సినిమా నుంచి నాకు ఎంతో సపోర్ట్‌గా ఉన్నారు. జగపతి బాబు గారు చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. జులై 31న ఈ సినిమాను అందరూ ఆదరించాలి" అని కోరారు.
హీరో సుమంత్ మాట్లాడుతూ సినిమాపై తనకున్న నమ్మకాన్ని పంచుకున్నారు. "'మళ్లీ రావా' తర్వాత సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేసిన కథ ఇది. ఈ సినిమాలో హీరో స్క్రీన్‌ప్లే. ప్రతి పాత్రకూ ప్రాధాన్యత ఉండటంతో పాటు, కథను మలుపు తిప్పే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సినిమాను అంగీకరించాను. మంచి థ్రిల్ ఉన్నప్పటికీ, దీని సెంట్రల్ డ్రామా ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. అందుకే ఈటీవీ విన్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఇది ఆకట్టుకుంటుంది. ట్రైలర్‌లో మేము చాలా తక్కువ కథనే చూపించాం. జులై 31న థియేటర్లకు వస్తే మీకు పెద్ద సర్‌ప్రైజ్ ఉంటుంది," అని తెలిపారు.
దర్శకుడు రాజేశ్ కర్ణ మాట్లాడుతూ, "ఈ సినిమా మీకు కచ్చితంగా గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఇంటర్వెల్‌కే పైసా వసూల్ ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్ మైండ్‌బ్లోయింగ్‌గా ఉంటుంది. మహేశ్ బాబు గారి '1 నేనొక్కడినే' సినిమా తర్వాత ఫిల్మ్‌మేకింగ్ గురించి ఎలా చర్చ జరిగిందో, ఈ సినిమా గురించి కూడా అలానే మాట్లాడుకుంటారు. 'న్యూటన్స్ థర్డ్ లా' థ్రిల్లర్ జానర్‌ను రీడిఫైన్ చేస్తుంది" అని ధీమా వ్యక్తం చేశారు.
ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ, కంటెంట్ హెడ్ భరణ్ మాట్లాడుతూ.. వైవిధ్యమైన కథలతో తమ బ్రాండ్‌ను నిర్మిస్తున్నామని, 'న్యూటన్స్ థర్డ్ లా' ఆ కోవలోనిదేనని పేర్కొన్నారు. నిర్మాత హరీశ్, హీరోయిన్ నేహా, సంగీత దర్శకుడు సింజిత్, నటులు త్రినాథ్, రవి వర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సినిమా విజయంపై విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో జగపతిబాబు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ, నేహా పఠాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.