టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ... కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు
- టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ
- ఆయనతో పాటు మరో 3 వేల మంది కూడా టీడీపీలో చేరిక
- సందడిగా మారిన టీడీపీ కార్యాలయం
రాష్ట్ర బీజేపీ నేతల వ్యవహారం నచ్చక కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. మరోవైపు కన్నా చేరికతో టీడీపీ మరింత బలపడుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ప్రస్తుతం కన్నాతో పాటు వచ్చిన నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు పార్టీ కండువాలు కప్పుతూ, ఆహ్వానిస్తున్నారు.