ఆసక్తిని రేపుతున్న 'గేమ్ ఆన్' టీజర్!
- ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో వస్తున్న 'గేమ్ ఆన్'
- హీరోగా గీతానంద్ పరిచయం
- కీలకమైన పాత్రలో ఆదిత్య మీనన్
- ప్రత్యేకమైన పాత్రలో మధుబాల
ఈ కథ అంతా కూడా సైకలాజికల్ గేమ్ చుట్టూ తిరుగుతుందనే విషయం టీజర్ ను బట్టి అర్థమవుతోంది. యాక్షన్ .. రొమాన్స్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన టీజర్ ఆసక్తిని రేపుతోంది. అశ్విన్ - అర్జున్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి, అభిషేక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను సమకూర్చాడు.
ఇంతకుముందు కార్తికేయ జోడిగా '90ML' చేసిన నేహా సోలంకి ఈ సినిమాలో కథానాయికగా నటించింది. ఆదిత్య మీనన్ .. మధుబాల కీలకమైన పాత్రలను పోషించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.