ఆ ప్రచారం వల్లనే నాకు అవకాశాలు రాలేదు: మమతా మోహన్ దాస్

ఆ ప్రచారం వల్లనే నాకు అవకాశాలు రాలేదు: మమతా మోహన్ దాస్

Mamatha Mohandas Interview
  • 'యమదొంగ' సినిమాతో పరిచయమైన మమతా మోహన్ దాస్
  • ఆ తరువాత తెలుగులో తగ్గిన అవకాశాలు
  • కొంతకాలం పాటు కేన్సర్ తో పోరాటం
  • త్వరలో 'రుద్రంగి'తో ప్రేక్షకుల ముందుకు 
తెలుగు తెరకి 'యమదొంగ' సినిమాతో పరిచయమైన మమతా మోహన్ దాస్, ఆ తరువాత 'కింగ్' .. 'కేడీ' .. 'చింతకాయల రవి' వంటి సినిమాలు చేసింది. ఆ తరువాత ఆమె మలయాళ సినిమాలపైనే పూర్తి దృష్టి పెట్టింది. తెలుగులో త్వరలో విడుదల కానున్న 'రుద్రంగి' సినిమాలో ఆమె ఒక కీలకమైన పాత్రను చేసింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను పంచుకుంది.  

"నేను నా కెరియర్ ను మొదలుపెట్టిన కొంతకాలానికే నాకు కేన్సర్ బయటపడింది. నా పేరెంట్స్ .. ఫ్రెండ్స్ నాకు చాలా మనోధైర్యం ఇచ్చారు. లైఫ్ లో ఒక టఫ్ పీరియడ్ ఎలా ఉంటుందనేది చూశాను. నా ట్రీట్మెంట్ కి సంబంధించి ఆ సమయంలో నేను ఎలాంటి పోస్టులు పెట్టలేదు. ఆ పరిస్థితుల్లో కూడా నేను మలయాళ సినిమాలు చేస్తూనే వెళ్లాను" అని అంది.  

"తెలుగులో మాత్రం 'కేడీ' సినిమా తరువాత నాకు మంచి పాత్రలు రాలేదు. నేను ఇంకా కేన్సర్ తోనే బాధపడుతున్నాననీ .. అందువలన సినిమాలు చేయడం లేదనే ప్రచారం జరిగింది. నేను అందుబాటులో లేననే ప్రచారం వల్లనే అవకాశాలు రాలేదని అనుకుంటున్నాను. నిజంగా ఇది నాకు చాలా బాధను కలిగించిన విషయం" అంటూ చెప్పుకొచ్చింది. 

Advertisement
Mamatha Mohandas
Actress
Kollywood

More Telugu News