ఆశలు నెరవేరకుండానే తారకరత్న తుదిశ్వాస విడవడం దురదృష్టకరం: పవన్ కల్యాణ్
- నందమూరి తారకరత్న కన్నుమూత
- తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయలు
- తారకరత్న కోలుకుంటాడని భావించినట్టు పవన్ వెల్లడి
నటుడిగా రాణిస్తూనే, ప్రజా జీవితంలో ఉండాలని తారకరత్న కోరుకున్నారని, కానీ ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తారకరత్న భార్యాబిడ్డలకు, తండ్రి మోహనకృష్ణ గారికి, బాబాయి బాలకృష్ణకు, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో వివరించారు.
తారకరత్న కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని వెల్లడించారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు.