గుడివాడ గుట్కాగాడు కొడాలి నాని, పిల్ల సైకో వల్లభనేని వంశీ అంటూ పట్టాభిరామ్ విమర్శలు
- జగన్ డీఎన్ఏ ఏమిటో కొడాలి నాని తెలుసుకోవాలన్న పట్టాభి
- మా దరిద్రం నువ్వే జగన్ అని ప్రజలు అనుకుంటున్నారని ఎద్దేవా
- అమరావతి పేరుతో రూ. 3,013 కోట్ల అప్పు చేశారని మండిపాటు
రాష్ట్ర ప్రజలందరూ 'మా దరిద్రం నువ్వే జగన్' అనుకుంటున్నారని పట్టాభి ఎద్దేవా చేశారు. రాజధానిని నిర్మిస్తున్నామని చెప్పి బ్యాంకుల నుంచి రూ. 3 వేల కోట్ల రుణాలు తీసుకున్నారని... ఇప్పుడు ఆ అప్పు కట్టాలంటూ బ్యాంకర్లు సీఆర్డీయే అధికారులను నిలదీస్తున్నారని తెలిపారు. ఏపీకి మూడు రాజధానులు ఉంటాయని 2019లో చెప్పిన జగన్... ఏ ముఖం పెట్టుకొని అమరావతి రాజధాని ముసుగులో రూ. 3,013 కోట్ల అప్పులు చేశారని ప్రశ్నించారు.