లోకేశ్ ను పిత్రి, గిత్రి అంటే నీకు మామూలుగా ఉండదు: రోజాకు ఆనం వెంకటరమణారెడ్డి వార్నింగ్

Anam Venkata Ramana Reddy warning to Roja
  • చెప్పులు మోసే స్థాయి నుంచి చెప్పులు మోయించే స్థాయికి రోజా వచ్చిందన్న ఆనం  
  • లోకేశ్ ను ఉద్దేశించి నోటికొచ్చినట్టు మాట్లాడుతోందని మండిపాటు
  • తిరుమల దర్శనాలను కూడా అమ్ముకుంటోందని ఆరోపణ
ఏపీ మంత్రి రోజాపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన సిబ్బంది చేత రోజా చెప్పులు మోయించారనే వార్తలపై ఆయన స్పందిస్తూ... చెప్పులు మోసే స్థాయి నుంచి, ఇప్పుడు జగన్ దయతో చెప్పులు మోయించే స్థాయికి రోజా వచ్చిందని విమర్శించారు. నారా లోకేశ్ ను ఉద్దేశించి నోటికొచ్చినట్టు రోజా మాట్లాడుతోందని... లోకేశ్ ను పిత్రి, గిత్రి అంటే నీకు మామూలుగా ఉండదు అని హెచ్చరించారు. చివరకు తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనాలను కూడా అమ్ముకునే స్థాయికి ఆమె దిగజారిందని మండిపడ్డారు. రోజా వ్యాపారాలు ఓ రేంజ్ లో ఉన్నాయని సాక్షాత్తు నగరి ప్రజలే అంటున్నారని చెప్పారు. 

Go Back to Shorts
Anam Venkata Ramana Reddy
Nara Lokesh
Telugudesam
Roja
YSRCP

More Telugu News