Smitha: 'నిజం' టాక్ షోలో రానా .. నానీ కలిసి కనిపించడానికి కారణం ఇదే: స్మిత

Smitha Interview
షార్ట్స్‌లో చూడండి
'సోనీ లివ్' ఫ్లాట్ ఫామ్ పై 'నిజం విత్ స్మిత' టాక్ షో మొదలైంది. నిన్నటి నుంచే ఈ టాక్ షో స్ట్రీమింగ్ స్టార్ట్ చేశారు. ఫస్టు ఎపిసోడ్ ను మెగాస్టార్ చిరంజీవితో చేశారు. గతంలో ఎక్కడా ప్రస్తావించని కొన్ని విషయాలను ఈ టాక్ షోలో చిరంజీవి చెప్పారు.

తాజా ఇంటర్వ్యూలో ఈ టాక్ షోను గురించి స్మిత మాట్లాడుతూ .. "కొవిడ్ కి ముందు ఈ టాక్ షో చేయాలని అనుకున్నాము. అయితే ఆ తరువాత ఏర్పడిన పరిస్థితుల వలన ఆలస్యమవుతూ వచ్చింది. ఈ సీజన్ కి సంబంధించిన షూటింగు క్రితం ఏడాదిలోనే చేయడం జరిగింది" అని అన్నారు. 

"ఈ టాక్ షోలో ఎవరినేం అడిగితే ఏమనుకుంటారోనని నేను భయపడలేదు. వారు కూడా ఫలానా ప్రశ్నలు ఉండకూడదని చెప్పలేదు. షూటింగు తరువాత కొన్ని ప్రశ్నలు తీసేయమని కూడా ఎవరూ అనలేదు. ఈ టాక్ షో చాలా సీరియస్ గా ఉంటుందేమోనని అనుకున్నాను. కానీ నవ్వుతూ సరదాగానే సాగింది" అని చెప్పారు. 

టాపిక్స్ ను బట్టి ఈ టాక్ షోకి ఆహ్వానించడం జరిగింది. తెలుగు సినిమాల్లో 'నెపోటిజం' గురించిన టాపిక్ కోసమే రానా .. నానీలను ఆహ్వానించడం జరిగింది. ఒకరు బలమైన సినిమా నేపథ్యం నుంచి వచ్చినవారు .. మరొకరు ఎలాంటి నేపథ్యం లేని వారు. వారిద్దరూ మంచి ఫ్రెండ్స్. అందువల్లనే వారిని పిలవడం జరిగింది" అన్నారు. ఆ తరువాత ఎపిసోడ్స్ లో చంద్రబాబునాయుడు .. రాధిక .. సాయిపల్లవి .. అనిల్ రావిపూడి .. అల్లరి నరేశ్ .. దేవ కట్టా .. సందీప్ రెడ్డి .. అడివి శేష్ తదితరులు కనిపించనున్నారు. 

Go Back to Shorts
Smitha
Chiranjeevi
Rana
Nani
Nijam Talk Skow

More Telugu News