DG Sunil Kumar: డీజీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలంటూ సీఎస్ కు లేఖ రాసిన డీవోపీటీ

DOPT wrote AP CS to take action on DG Sunil Kumar
షార్ట్స్‌లో చూడండి
గతంలో ఏపీ సీఐడీ చీఫ్ గా వ్యవహరించిన డీజీ సునీల్ కుమార్ వ్యవహారంపై ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదుపై కేంద్రం స్పందించింది. డీజీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర సీఎస్ కు డీవోపీటీ లేఖ రాసింది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అండర్ సెక్రటరీ సంజీవ్ కుమార్ ఏపీ సీఎస్ కు లేఖ పంపారు. 

సునీల్ కుమార్ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని రఘురామకృష్ణరాజు గతంలో తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంబేద్కర్ ఇండియా మిషన్ వేదికగా డీజీ విద్వేష వ్యాఖ్యలు చేశారని వివరించారు. అప్పట్లో రఘురామ డీవోపీటీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.
Go Back to Shorts
DG Sunil Kumar
DOPT
AP CS
CID
Andhra Pradesh

More Telugu News