విజయ్ కు టీడీపీ అండగా ఉంటుంది: పట్టాభి
- అయ్యన్నపాత్రుడు కుటుంబాన్ని ప్రభుత్వం వేధిస్తోందన్న పట్టాభి
- తప్పుడు కేసులు పెడుతోందని మండిపాటు
- రాష్ట్రంలో సైకో పాలన నడుస్తోందని విమర్శ
సీఐడీ విచారణను ఎదుర్కొంటున్న చింతకాయల విజయ్ కు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని అన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ వీడియో విచారణ జరిపించాలని వైఎస్ అవినాశ్ రెడ్డి కోరుతున్నారని.. కానీ, ఇతరులను మాత్రం వీడియో విచారణ లేకుండా వేధిస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ సోషల్ మీడియా విభాగానికి ఇన్చార్జ్ గా ఉన్న విజయ్... ప్రభుత్వ అవినీతి కుంభకోణాలను ఆధారాలతో ప్రజల ముందు ఉంచుతున్నారని... అందుకే అతనిపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపించారు.