ఎక్చేంజ్ లో మీ ఫోన్ ఎక్కువ ధర పలకాలంటే.. ఇలా చేసిచూడండి!
- స్మార్ట్ ఫోన్ ఎక్చేంజ్ కు నిపుణులు సూచిస్తున్న టిప్స్
- మొబైల్ పై గీతలు పడకుండా జాగ్రత్తగా వాడుకోవాలని సూచన
- మార్పిడి సమయంలో ఫోన్ ను శుభ్రం చేయాలంటున్న నిపుణులు
- ప్యానల్ మార్చడం ద్వారా కొంత ఫలితం ఉంటుందని వెల్లడి
ఇలా చేయండి..
- చూసీచూడంగానే పాత ఫోన్ అని గుర్తించేలా ఉన్న ఫోన్ కు ఏ కంపెనీ ఎక్కువ వెలకట్టదు. అందుకే మీ స్మార్ట్ ఫోన్ ను జాగ్రత్తగా క్లీన్ చేయాలి. స్క్రీన్ పై ఎలాంటి గీతలు లేకుండా చూసుకోవాలి.
- స్మార్ట్ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై గీతలు పడినట్టయితే ప్యానెల్ మార్చేయండి. దీనివల్ల ప్యానెల్ మాత్రమే కాదు మీ ఫోన్ కూడా కొత్తదానిలా కనిపిస్తుంది. ఫలితంగా ఎక్కువ ధర పలుకుతుంది.
- వాడకంలో ఉన్న ఫోన్ కొన్నాళ్లకు వేగం మందగిస్తుంది. దీనివల్ల కూడా ఎక్చేంజ్ సమయంలో పెద్దగా ధర పలకదు. ఎక్చేంజ్ కు ముందు ఫోన్ సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేస్తే ఫోన్ స్పీడ్ పెరుగుతుంది.
- మీ ఫోన్ వేగంగా పనిచేస్తుండడంతో ఎక్చేంజ్ లో ఎక్కువ మొత్తం పలుకుతుంది. ఆ మేరకు మీ కొత్త ఫోన్ ధరలో తగ్గింపును పొందొచ్చు.
- కొత్త ఫోన్ కొన్నప్పటి నుంచి జాగ్రత్తగా వాడుకుంటే ఎక్చేంజ్ సమయంలో మంచి ధర పొందొచ్చు. ముఖ్యంగా తరచూ ఫోన్ లు మార్చే అలవాటు ఉన్నవాళ్లు ఈ జాగ్రత్తలు పాటిస్తే తక్కువ ఖర్చుతో ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్ ఫోన్ వాడుకోవచ్చు.