ఇతర టెక్ సంస్థల బాటలో సిస్కో... 4 వేల ఉద్యోగాలకు కత్తెర!
- ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తున్న టెక్ సంస్థలు
- ఖర్చులు తగ్గించుకోవడమే లక్ష్యం
- గత నెలలోనే నిర్ణయం తీసుకున్న సిస్కో
తాజాగా, అమెరికా టెక్ దిగ్గజం సిస్కో కూడా ఇదే బాటలో నడుస్తోంది. 4 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. గత నెలలోనే సిస్కో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగుల్లో 5 శాతం మందిని తొలగించనుంది.
ఆదాయ, వ్యయాల మధ్య సమతుల్యత సాధించడం కోసమే సిస్కో ఈ నిర్ణయం తీసుకుందని ఓ బిజినెస్ మ్యాగజైన్ పేర్కొంది.