విశాఖలో శ్రద్ధా వాకర్ తరహా హత్య కేసు... ఛేదించిన పోలీసులు

Vizag police busted murder mystery of a women
  • ఢిల్లీలో శ్రద్ధా వాకర్ ను చంపి 35 ముక్కలు చేసిన యువకుడు
  • విశాఖలో మహిళను చంపి డ్రమ్ములో దాచిన వ్యక్తి
  • మృతదేహాన్ని గుర్తించిన ఇంటి యజమాని
  • నిందితుడు రిషిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఇటీవల ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అనే యువతిని ఆమె ప్రియుడు ఆఫ్తాబ్ హత్య చేసి 35 ముక్కలుగా చేసి, అనంతరం వాటిని వివిధ ప్రదేశాలలో పారవేసిన ఘటన మరువక ముందే ఏపీలోనూ అలాంటి ఘటనే వెల్లడైంది. మహిళను హత్య చేసిన వ్యక్తి ఆమె మృతదేహాన్ని ఏడాది పాటు డ్రమ్ములో దాచిన విషయం బట్టబయలైంది. ఈ ఘటన విశాఖపట్నంలోని మధురవాడ వికలాంగుల కాలనీలో చోటుచేసుకుంది. 

ఈ హత్య కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు ఛేదించారు. మృతురాలు శ్రీకాకుళం జిల్లాకు చెందిన బమ్మిడి ధనలక్ష్మిగా గుర్తించారు. రిషి అనే వ్యక్తి ఆమెను హత్య చేసినట్టు తేల్చారు. 

గతంలో శ్రీకాకుళం బస్టాండ్ లో రిషి, ధనలక్ష్మి మధ్య పరిచయం ఏర్పడింది. ధనలక్ష్మిని రిషి మధురవాడ తీసుకువచ్చాడు. అక్కడివారికి తన భార్య అని చెప్పాడు. కొన్నాళ్ల తర్వాత ధనలక్ష్మి... రిషిన డబ్బులు డిమాండ్ చేసింది. అయితే అందుకు నిరాకరించిన రిషి... ఈ గొడవ పెద్దదైతే అందరికీ తెలుస్తుందని భావించి ధనలక్ష్మి మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. మృతదేహాన్ని ఓ ప్లాస్టిక్ డ్రమ్ములో ఉంచి అద్దె ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. తన భార్య పుట్టింటికి వెళ్లిందని, ఆమె వచ్చాక ఇంటి అద్దె చెల్లిస్తానని ఇంటి యజమానికి చెప్పాడు. 

ఈ విధంగా ఏడాది గడవడంతో ఇంటిని ఖాళీ చేయించేందుకు యజమాని వెళ్లారు. అయితే అక్కడ దుర్వాసన వస్తుండడంతో డ్రమ్ములో చూడగా మృతదేహం కనిపించింది. వెంటనే ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో, పోలీసులు నిందితుడు రిషిని అరెస్ట్ చేశారు.
Go Back to Shorts
Dhanalakshmi
Rishi
Madhuravada
Vizag
Police

More Telugu News