స్టయిఫండ్ పెంచాలని జూనియర్ డాక్టర్ల డిమాండ్.. ఏపీ ప్రభుత్వానికి సమ్మె నోటీసులు
- స్టయిఫండ్ 42 శాతం పెంచాలని విజ్ఞప్తి
- ఈ నెల 25 వరకు నల్లబ్యాడ్జీలతో నిరసన
- 26 నుంచి ఓపీ సేవలు బంద్ చేస్తామని హెచ్చరిక
ఇతర రాష్ట్రాలకంటే తక్కువ..
మిగతా రాష్ట్రాల్లోని జూనియర్ డాక్టర్లకు అందించే స్టయిఫండ్ తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో చాలా తక్కువ అని జూనియర్ డాక్టర్లు విమర్శించారు. హౌస్ సర్జన్లకు ఇతర రాష్ట్రాల్లో రూ. 30 వేలు, స్పెషాలిటీ పీజీలకు రూ.65 వేలు, సూపర్ స్పెషాలిటీ పీజీలకు రూ.80 వేలు చెల్లిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మాత్రం హౌస్ సర్జన్లకు రూ.19 వేలు, స్పెషాలిటీ పీజీలకు రూ.44 వేలు, సూపర్ స్పెషాలిటీ పీజీలకు రూ.53 వేలు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. కాగా, రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు సమ్మె నోటీసులు ఇవ్వడం నిజమేనని ఇన్ చార్జి డీఎంఈ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. త్వరలోనే జూనియర్ డాక్టర్ల స్టయిఫండ్ ను ప్రభుత్వం పెంచనుందని వివరించారు.