ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం.. ఆగస్టు 15ను పండుగలా జరుపుకుందాం: మోదీ
- ‘హర్ ఘర్ తిరంగా’లో పాల్గొనాలని మోదీ పిలుపు
- ఆగస్టు 15న ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం ఎగరేయాలని సూచన
- స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించాలని విజ్ఞప్తి
- ‘వికసిత్ భారత్’ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేయాలని పిలుపు
- ఈ ఏడాది ‘వందేమాతరం’కు ప్రత్యేక ప్రాధాన్యం
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో ప్రజలు చురుగ్గా పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆగస్టు 15న ప్రతి ఇంటా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించాలని కోరారు. ‘హర్ ఘర్ తిరంగా.. ఘర్ ఘర్ తిరంగా.. హర్ మన్ తిరంగా’ అంటూ దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రీల్‌ను షేర్ చేసుకున్న ప్రధాని.. ఆగస్టు 15ను గర్వంగా జరుపుకోవాలని సూచించారు. ‘వికసిత్ భారత్’ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రతి ఇంటా హర్ ఘర్ తిరంగాను ఓ వేడుకగా మార్చుకుందాం’’ అని పేర్కొన్నారు.
ఇటీవల ‘ఎక్స్’ వేదికగానూ మోదీ ‘హర్ ఘర్ తిరంగా’లో ఉత్సాహంగా పాల్గొనాలని ప్రజలను కోరారు. త్రివర్ణ పతాకం దేశ గర్వానికి ప్రతీక అని తెలిపారు. దేశం కోసం అత్యుత్తమంగా పనిచేయాలనే స్ఫూర్తిని అది అందిస్తుందని పేర్కొన్నారు.
ఈ ఏడాది ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవానికి అంకితం చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. దేశభక్తి, త్రివర్ణం పతాకంపై గర్వం, మాతృభూమిపై ప్రేమను చాటేలా కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ప్రారంభమైన ‘హర్ ఘర్ తిరంగా’ ద్వారా జాతీయ పతాకంతో ప్రజలకు మరింత వ్యక్తిగత అనుబంధం ఏర్పడేలా ప్రోత్సహిస్తున్నారు.