Jagapathi Babu: 'భీమ్ రావ్ దొర'గా పవర్ఫుల్ పాత్రలో జగపతిబాబు! 

Rudrangi Movie Update
షార్ట్స్‌లో చూడండి

ఒక వైపున విలన్ గా .. మరో వైపున ఇతర పాత్రలతోను జగపతిబాబు బిజీగా ఉన్నారు. అడపా దడపా నాయక లక్షణాలు కలిగిన ప్రధానమైన పాత్రలను సైతం చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఆయన 'రుద్రంగి' అనే సినిమాను చేశారు. ఈ కథలో 'రుద్రంగి' ప్రస్తావన ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆమె కోసం ఎంతకైనా తెగించే పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. 

తాజాగా అందుకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. బండి చక్రంతో శత్రువులపై విరుచుకుపడుతూ ఈ పోస్టర్లో జగపతిబాబు కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన 'భీమ్ రావ్ దొర' పాత్రలో కనిపించనున్నాడనే విషయాన్ని చెప్పారు. 'రుద్రంగి నాది' అనే జగపతిబాబు డైలాగ్ తో ఈ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దీనిని బట్టి 'రుద్రంగి పట్ల ఆయనకి గల వ్యామోహం ఏ స్థాయిలో ఉందనేది అర్థమవుతోంది. 

రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమాకి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించాడు. టైటిల్ రోల్ ను కన్నడ హీరోయిన్ పోషించింది. మమత మోహన్ దాస్ .. ఆశిష్ గాంధీ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఈ కథ దొరల కాలంలో జరుగుతుందనే విషయం అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నారు
Go Back to Shorts
Jagapathi Babu
Ganavi Lakshman
Rudrangi Movie

More Telugu News