Andhra Pradesh: జ‌గ‌న్ కుటుంబం జోలికి వ‌స్తే నాలుక కోస్తాం: మంత్రి రోజా

roja fires on tdp and ayyannapatrudu
షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం జ‌గ‌న్‌ను గానీ, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను గానీ విమ‌ర్శించే వారి నాలుక కోసి ఉప్పూ కారం పెడ‌తామ‌ని ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు శ‌నివారం ఓ బైక్ ర్యాలీలో పాల్గొన్న సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేత‌ల‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్‌పై మాట్లాడే అర్హ‌త టీడీపీకి లేద‌న్న ఆమె... రాష్ట్రంలో ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన ఘ‌న‌త వైసీపీదేన‌ని అన్నారు.

టీడీపీ సీనియ‌ర్ నేత అయ్య‌న్న‌పాత్రుడు పేరును ప్ర‌స్తావించిన రోజా... అయ్య‌న్నపాత్రుడు లాంటి నేత‌లు సైకోల మాదిరిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు. అలాంటి నేత‌ల‌ను త్వ‌ర‌లో పిచ్చాసుప‌త్రిలో చేర్చ‌క‌పోతే ప్ర‌జ‌లే రాళ్ల‌తో కొట్టి చంపేస్తార‌న్న విష‌యాన్ని టీడీపీ నేత‌లు గుర్తించాల‌న్నారు. అయ్య‌న్న వ్యాఖ్య‌లు చూస్తే... ఆయ‌న వ‌య‌సుకు గానీ, ఆయ‌న చేప‌ట్టిన ప‌ద‌వుల‌కు గానీ గౌర‌వం ఇవ్వ‌లేక‌పోతున్నామ‌ని ఆమె అన్నారు. రాజ‌కీయంగా స‌మ‌స్య‌లు దొర‌క‌లేద‌ని జ‌గ‌న్ కుటుంబంపై విమ‌ర్శ‌లు చేస్తే ఇక‌పై స‌హించ‌బోమ‌ని ఆమె హెచ్చ‌రించారు.
Go Back to Shorts
Andhra Pradesh
YSRCP
TDP
Roja
Ayyanna Patrudu
NTR

More Telugu News